మరికొద్ది గంటల్లో అభిరామ్ పెళ్లి.. దగ్గుబాటి హీరోకు మర్చిపోలేని స్పెషల్ గిఫ్ట్‌ ఈ విధంగా వచ్చిందా..?

దగ్గుపాటి హీరో అభిరామ్ కేవలం ఒకే ఒక్క సినిమాలో చేసినా ఆ సినిమాతో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. రామానాయుడు మనవడిగా, సురేష్ బాబు తనయుడిగా, రానా తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అహింస సినిమాలో తను నటనతో ప్రేక్షకులను మెపించలేకపోయాడు. మనిషి చూడడానికి హ్యాండ్సమ్ గా ఉన్న అతని యాక్టింగ్ అసలు బాలేదు, యాక్టింగ్ నేర్చుకుని ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు వినిసించాయి. ఎన్నో విమర్శల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ధియేటర్లలో కూడా ఫ్లాప్ గా నిల్చింది. తేజ – ఆర్.పి పట్నాయక్ కాంబినేషన్ కూడా ఈ సినిమాను గట్టెక్కించలేకపోయింది.

ఇక హీరోయిన్ గీతిక తన పాత్రకు తగ్గట్టుగా ఆకట్టుకున్న.. మంచి సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఓటిటిలోకి కూడా ఈ సినిమా వచ్చింది. కానీ ఇప్పటివరకు బుల్లితెరపై ఈ సినిమాను ప్రదర్శించలేదు. అహింస సినిమా శాటిలైట్ రైట్స్ జెమినీ గతంలోనే దక్కించుకోగా.. ఇప్పుడు ఈ ఆదివారం ప్రచారం చేయబోతుంది. ఇక మరి కొద్ది గంటల్లో అభిరామ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. దీంతో అభిరామ్ పెళ్లికి ఇది ఓ స్పెష‌ల్‌ గిఫ్ట్ గా భావించవచ్చు.

కనీసం టీవీలో అయినా ఈ సినిమా క్లిక్ అవుతుందో లేదో చూడాలని అభిరామ్ ఆశపడుతున్నాడు. ఈ మూవీ తర్వాత మళ్లీ కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయలేదు అభిరామ్. ఈమధ్య ఓ కాఫీ షాప్ పెట్టిన ఈ హీరో స్క్రిప్ట్‌లు వస్తున్న ఇంకా నేను దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వివరించాడు. ఇక తాజాగా పెళ్లికి ఓకే చెప్పిన ఈ హీరో మరి కొద్ది రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సురేష్ బాబు దగ్గరుండి ఈ పెళ్ళి కుద్దిర్చాడు. ఈ పెళ్లి తర్వాత అయినా అభిరామ్‌ సినీ కెరీర్‌లో సక్సెస్ అవుతాడేమో చూడాలి.