యూఎస్ లో మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన ” సలార్ “..!!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గానే ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ విడుదలైన ఐదు నిమిషాలకే భారీ స్థాయిలో లైకుల వర్షం కురిసింది.

ఇక దీంతో అభిమానులు మరింత ఎగ్జైటెడ్ గా ఉండగా యూఎస్ ప్రీమియర్లలో అయితే సలార్ హవ కనిపిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఇప్పుడు జస్ట్ అడ్వాన్స్ సేల్స్ లోనే నాలుగు లక్షల డాలర్లు మార్క్ ని క్రాస్ చేసి హాఫ్ మిలియన్ దిశగా దూసుకెళ్తున్నట్లు సమాచారం.

ఇక దీని బట్టి చూసుకుంటే.. ఈ సినిమా పై హైప్స్ ఏ లెవెల్ లో నెలకొన్నాయో తెలుస్తుంది. ఇక ఈ భారీ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ నెల (డిసెంబర్ 22న) పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.