ఎన్టీఆర్‌తో ఫొటో షేర్ చేస్తూ కాంగ్రెస్ విక్ట‌రీపై నాని షాకింగ్ కామెంట్స్‌…!

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 7న సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన వరుస ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు నేచురల్ స్టార్. ఇందులో భాగంగానే నాని వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కూడా ముచ్చటిస్తున్నాడు. ఇలా నాని హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్ లో విపరీతంగా స్పీడ్ పెంచాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న‌ అభిమానులతో మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానలు చెప్పుకొచ్చాడు నాని.

అయితే ఓ అభిమాని తెలంగాణ ఎన్నికల గురించి నాని ని ప్రశ్నించాడు. మీరు ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేశారు.. మరి కాంగ్రెస్ విక్ట‌రీపై మీ ఒపీనియన్ ఏంటి అంటూ ప్రశ్నించగా.. నాని దీనికి ఎంత తెలివిగా సినీ భాష‌లో సమాధానాన్ని చెప్పాడు. మనం గత పదేళ్లుగా ఓ సినిమాను చూస్తున్నాం. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక మరో కొత్త సినిమా రాబోతుంది.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం అంటూ రిప్లై ఇచ్చాడు. ఈయన తన సినిమా స్టైల్ లో చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతలోనే మరో అభిమాని మీరు ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఓ రేర్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయమంటూ అడగడంతో నాని కూడా దాన్ని ఓకే చేశాడు. వెంట‌నే ఎన్టీఆర్‌ను హగ్ చేసుకుని.. క్లోజ్‌గా దిగిన ఫోటో ని నాని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట‌ చెక్కర్లు కొడుతుంది. ఇక హాయ్ నాన్న సినిమాలో తండ్రి కూతుళ్ళ‌ ఎమోషన్ గురించి ఎంతో అద్భుతంగా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు నాని. ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా, బేబీ కియారా కిలక పాత్రలో నటిస్తున్నారు. ఇక చివరిగా దసరా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. ఈ సినిమాతో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి.