మాకు ఆ మూవీ సీక్వెల్ కావాలి.. అనిల్ రావిపూడికి మాస్ మహారాజ్ ఫ్యాన్స్ డిమాండ్..

రవితేజ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో గతంలో రాజా ది గ్రేట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ మార్కెట్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇక రవితేజ ఇటీవల పలువరస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా రవితేజ – అనిల్ రావిపూడి కాంబోలో కూడా ఓ సినిమా తెర‌కెక్కాల్సిఉంది. దీనికి ఇంకా టైం ఉండగా.. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ఓ సినిమా కొంతకాలం గ్యాప్ రావడంతో ఈ గ్యాప్ లో అనిల్ రావిపూడి – రవితేజ కాంబినేషన్ తెర‌కెక్కించాలని భావిస్తున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇంకో నెలలో రవితేజ – అనిల్ రావిపూడి సినిమా స్టార్ట్ అవ్వబోతుంది.

ఇక గతంలో రాజా ది గ్రేట్ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న అనిల్ – రవితేజ కాంబోకు కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇటీవల కాలంలో ఆ సినిమాకు సీక్వెల్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని హీరో, దర్శకుడు వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి మరో అడుగు ముందుకేసి రాజా ది గ్రేట్ సీక్వెల్ కు లైన్ కూడా ఉందంటూ ప్రకటించాడు. దేంతో ఫ్యాన్స్ మరింత అలర్ట్ అయ్యారు. మాకు ఆ సినిమా సీక్వెల్ కావాల్సిందే అంటూ.. సోషల్ మీడియాలో అనిల్ రావిపూడిని డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో రాజా ది గ్రేట్ ఫొటోస్, డైలాగ్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ బ్లైండ్ పర్సన్ గా కనిపించాడు. వీరిద్ద‌రు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫన్ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌లో క్రియేట్ చేసి హిట్‌గా నిలిచింది. దీంతో మళ్లీ అదే స్థాయిలో ఎంటర్టైన్మెంట్ కావాలంటే రవితేజ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ సినిమా సీక్వెల్‌ అనిల్ రావిపూడి ఎప్పటికీ తెరకెక్కిస్తాడో చూడాలి.