బలగం డైరెక్టర్ తో నేచురల్ స్టార్ నాని సినిమా… వైరల్ అవుతున్న ట్వీట్…!!

నాచురల్ స్టార్ నాని హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా.. నటిస్తున్న తాజా మూవీ” హాయ్ నాన్న “. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ శౌర్యూవ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఇక రిలీజ్ సమయం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే నాని.. తన X ఖాతాలో అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కొత్త దర్శకులలో మీరు ఎవరితో సినిమా చేయాలని కోరుకుంటున్నారు అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. దానికి నాని సమాధానం ఇస్తూ..” బలగం ఫేమ్ వేణు తో వర్క్ చేయాలని అనుకుంటున్నాను ” అంటూ చెప్పాడు.

ఇక దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ట్వీట్ చూసిన ప్రేక్షకులు…” ఈయన కల నెరవేరాలి ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నాని హాయ్ నాన్న సినిమాపై ఈయన అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.