పారిజాతం పూలతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..?!

చాలామంది పారిజాతం పూలతో పూజలు చేస్తూ ఉంటారు. పారిజాతకం పూలతో పూజ చేస్తే దేవునికి ఎంతో ఇష్టమని, ఆయన ఆశీస్సులు లభిస్తాయని చెప్తుంటారు. అయితే ఈ పూల వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కోకలలుగా ఉన్నాయి. పారిజాతం పూలే కాదు ఈ చెట్టు ఆకు, బెరడు, కొమ్మలు ఇవన్నీ కూడా ఔషధాలుగా పని చేస్తాయి. పారిజాతం పూలలో, ఆకులలో చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. జ్వరాన్ని తగ్గించడానికి కూడా దీని మందుల ఉపయోగించవచ్చు.

ఈ చెట్టు బెరడుతో ఫీవ‌ర్‌కి చెక్ పెట్టవచ్చు. చెట్టు బెరడును తీసి.. నీటిలో వేసి మరిగించుకొని కషాయం తాగితే జ్వరం ఠ‌క్కున‌ మాయమవుతుంది. ఇక కీళ్లనొప్పులతో, ఆర్థసైటీస్ ఇబ్బందులతో బాధపడే వారికి కూడా పారిజాత పూలు ఎంతగానో సహకరిస్తాయి. ఈ ఆకులను టీ లాగా చేసుకుని తాగిన కూడా చాలా మంచిది. యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కలిగి ఉన్న ఈ ఆకులు వాపులు తగ్గించడానికి కూడా సహకరిస్తాయి.

మానవ శరీరంలో పితాదోషం అనే అజీర్ణ సమస్యకు చెక్ పెట్టడానికి పారిజాతం పూలు బాగా సహకరిస్తాయి. గ్యాస్టిక్ సమస్యలకు కూడా ఈ పూలతో చెక్ పెట్టవచ్చు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి ఎన్నో సమస్యల నుంచి పారిజాతం ఉపశమనాన్ని ఇస్తుంది. పారిజాతం పూలని లేదంటే ఆకులని టీ చేసుకుని.. తేనె కలుపుకొని పరగడుపున తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయట. ఇక పారిజాతం పువ్వులతో టీ రోజు తాగి మీ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి ఇలా.