” శ్రీ లీల యాక్టరే కాదు.. పెద్ద గేమర్ కూడా “… నితిన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

నితిన్ హీరోగా.. శ్రీ లీల హీరోయిన్గా.. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ముఖ్యపాత్రలో కనిపింనున్నారు. డిసెంబర్ 8న గ్రాండ్ రిలీస్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ లో ఈ సినిమా ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ..” నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను. నాకు డ్యాన్స్ వచ్చు, యాక్టింగ్ కూడా వచ్చు. అయితే.. శ్రీ లీల డాన్స్, యాక్టింగ్ బాగా చేస్తుందని విన్నాను. ఆమె డాక్టర్ చదువుతుందని కూడా తెలుసు.

అయితే షూటింగ్ మొదటి రోజే శ్రీ లీల వచ్చినప్పుడు తన గురించి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఆమె యాక్టింగ్, డాన్స్ మాత్రమే కాదు.. స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ లో ఆడింది. హాకీ స్టేట్ లెవెల్ లో ఆడింది. ఇంకా కూచిపూడి, భరతనాట్యం వచ్చు. వీణ కూడా వాయిస్తుంది. ఇక ఇంత చిన్న పిల్లలో అన్ని టాలెంట్స్ ఉండటం నేను నిజంగా ఆశ్చర్యపోయాను. నిజంగా ఆమె గ్రేట్ ” అంటూ శ్రీ లీలను పొగిడేసాడు. ప్రస్తుతం నితిన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.