నేషనల్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ” సలార్ ” ట్రైలర్..!!

పాన్ ఇండియా ఫేమ్‌ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.

ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి మరో ట్రైలర్‌ని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ట్రైలర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో అన్ని భాషలు కలిపి 150 మిలియన్ వ్యూస్ కి పైగా దూసుకుపోతుంది.

ఇక నెక్స్ట్ వచ్చే ట్రైలర్ కి ఇంకెంత రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ ట్రైలర్ రెస్పాన్స్ని చూసిన ప్రభాస్ అభిమానులు… డార్లింగ్ సినిమా అంటే మినిమం ఉంటుంది… అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.