బిగ్ బాస్ హౌస్ లోకి శివాజీ కొడుకు ఎంట్రీ… ఆ విషయంలో అందరి నోర్లు మూయించాడుగా…!!

బిగ్ బాస్ సీజన్ 7 ఎంత రసవక్తంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే. తొమ్మిదో వారంలో తేజ ఎలిమినేట్ అవ్వడంతో.. పదోవారం నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు. కానీ అన్ని వారాలకి భిన్నంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ నిర్వహించాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఎన్నో గొడవలతో ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈవారం నామినేషన్స్ లో ఉన్నవారు.. భోలె, గౌతమ్, శివాజీ, యావర్, రతికా.

అయితే ప్రతి సీజన్లోనూ ఫ్యామిలీ ఎపిసోడ్ కంపల్సరిగా ఉంటుంది. అది కూడా ఎప్పుడో 80వ ఎపిసోడ్ లో ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఇంకా 10 వారాలు కూడా పూర్తికాకుండానే ఫ్యామిలీ వీక్ మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా తాజాగా ప్రోమో విడుదలైంది. ఇందులో శివాజీ పెద్ద కొడుకు హౌస్ లోకి డాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి.. తన తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ ప్రోమో నిజంగా చాలా ఎమోషనల్ గా ఉంది. శివాజీ తన కొడుకుని పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోయాడు.

ఇంటి సభ్యులంతా కూడా అతన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక శివాజీ కొడుకు మాట్లాడుతూ..” నువ్వు ఏడిస్తే ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఏడుస్తారు. నువ్వు ఏడవకూడదు. స్ట్రాంగ్ గా ఉండు ” అంటూ చెప్పాడు. ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు…” ఈ ప్రోమో ని చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంది ఈ ప్రోమో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.