చిరంజీవికి విల‌న్ గా చ‌చ్చినా చెయ్య‌న‌ని గోపీచంద్ రిజెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ సినీ కెరీర్ ఎలా ప్రారంభ‌మైందో తెలిసిందే. మొద‌ట హీరోగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన గోపీచంద్‌.. ఆ త‌ర్వాత జ‌యం, వ‌ర్షం, నిజం వంటి సినిమాల్లో విల‌న్ గా యాక్ట్ చేశాడు. తెలుగువారికి బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఆపై మ‌ళ్లీ హీరోగా ట‌ర్న్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. హీరోగా నిల‌దొక్కుకున్నా గోపీచంద్ విల‌న్ పాత్ర‌లు చేయ‌డానికి మొగ్గు చూప‌లేదు.

ఈ క్ర‌మంలోనే చాలా సినిమాల‌ను రిజెక్ట్ చేశాడు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి మూవీ కూడా ఉంద‌ని మీకు తెలుసా..? అవును.. చిరంజీవికి విల‌న్ గా చేసే అవ‌కాశం వ‌స్తే చ‌చ్చినా చెయ్య‌న‌ని గోపీచంద్ ఓ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఆ సినిమా మ‌రేదో కాదు `గాడ్ ఫాద‌ర్`. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ లూసీఫ‌ర్ గా రీమేక్ గా తెర‌కెక్కిన చిత్ర‌మిది.

మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా న‌టిస్తే.. ఆయ‌న చెల్లెలుగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార యాక్ట్ చేసింది. న‌య‌న‌తార‌కు భ‌ర్త‌గా విల‌న్ పాత్ర‌లో హీరో స‌త్య‌దేవ్ యాక్ట్ చేశాడు. అయితే మొద‌ట ఆ పాత్ర కోసం హీరో గోపీచంద్ ను సంప్ర‌దించార‌ట‌. కానీ, గోపీచంద్ మాత్రం గాడ్ ఫాద‌ర్ ను రిజెక్ట్ చేశారు. విల‌న్ పాత్ర బ‌లంగా లేద‌ని చెప్పి సున్నితంగా నో చెప్పారు. ఆ త‌ర్వాత స‌త్య‌దేవ్ ను ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం తీసుకున్నారు. కాగా, గత ఏడాది విడుద‌లైన గాడ్ ఫాద‌ర్ ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయింది.