మ‌హేష్ ధ‌రించిన ఆ స్వెట్‌ష‌ర్ట్ కాస్ట్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు.. మ‌రీ టూ మ‌చ్ రా బాబు!

ఖ‌రీదైన వ‌స్తువుల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే టాలీవుడ్ సెల‌బ్రిటీల్లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముందు వ‌రుస‌లో ఉంటాడు. తాజాగా ఇదే మ‌రోసారి రిపీట్ అయింది. రీసెంట్ గా మ‌హేష్ బాబు ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నాడు. ఇదే పార్టీకి విక్ట‌రీ వెంక‌టేష్ కూడా హాజ‌రు అయ్యారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో అన్న‌ద‌మ్ములుగా యాక్ట్ చేసి అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న మ‌హేష్ బాబు, వెంక‌టేష్.. చాలా రోజుల త‌ర్వాత క‌లుసుకోవ‌డంతో ఫుల్ గా చిల్ అయ్యారు.

ఇద్ద‌రూ క‌లిసి పార్టీలో కార్డ్స్ కూడా ఆడారు. అలాగే వెంక‌టేష్ తో దిగిన ఓ పిక్ ను సోష‌ల్ మీడియాలో పంచుకున్న మ‌హేష్ బాబు.. పెద్దోడు పక్కన ఉంటే ఎంతో సరదాగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. అయితే అందులో మ‌హేష్ బాబు ధ‌రించిన స్వెట్‌ష‌ర్ట్ ధ‌ర హాట్ టాపిక్ గా మారింది. ఆరెంజ్ కలర్ స్వెట్ షర్ట్ మ‌హేష్ బాబు లుక్ ను మ‌రింత అట్రాక్టివ్ గా మార్చేసింది.

హీర్మేస్ బ్రాండ్ కు చెందిన ష‌ర్ట్ అది. దాని కాస్ట్ ఎంతో తెలుసా.. అక్ష‌రాల రూ. 1,21,330. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు క‌ళ్లు తేలేస్తున్నారు. ఒక ష‌ర్ట్ అంత కాస్టా.. మ‌రీ టూ మ‌చ్ రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం మ‌హేషా మాజాకా అంటూ గొప్ప‌ల‌కు పోతున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు గుంటూరు కారంతో బిజీగా ఉన్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ట‌ర్ చేస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుదల కానుంది.