పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెకుతున్న మూవీ సలార్. కే జి ఎఫ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా కావడం అలాగే వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఇక గతంలో సెప్టెంబర్ 28న ఈ మూవీని రిలీజ్ చేయల్సిన ఈ మూవీని క ఏవో కారణాలతో డిసెంబర్ 22న కు రిలీజ్ చేయబోతున్నారు. ఇక ప్రస్తుతం సలార్ ఓటిటి హక్కులు కళ్ళు చెదిరే మొత్తానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసిందంటూ న్యూస్ వైరల్ అవుతున్నాయి.
సలార్ ఓటీటీ హక్కులను మొత్తం రూ.160 కోట్లకు ఓ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. సలార్ సినిమాను రూపొందించిన హోంభలే ఫిలిమ్స్ తో కొద్ది రోజుల కిందట నెట్‌ఫ్లిక్స్ ఈ డీల్ కుదుర్చుకుందట. కాగా వరస ఫ్లాప్‌లు వచ్చినా కూడా ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ఈ ఓటీటీ డీల్ ఒకటి సరిపోతుంది. ఇక సలార్ కంటే ఒక రోజు ముందు షారుక్ ఖాన్ డుంకి సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే షారుక్ ఖాన్ వరుసగా పఠాన్, జవాన్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను తన సొంతం చేసుకున్నాడు.
ఇదే నేపథ్యంలో డుంకి సినిమాకు కూడా ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. డుంకి కూడా భారీ కలెక్షన్లతో రికార్డులను సృష్టించడం ఖాయం అంటూ బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే ప్రభావం సలార్ సినిమాపై కూడా ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఈ కారణంగా మూవీని వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ వాటిలో నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ 22న సలార్ బ్లాస్ట్ అవుతుంది అంటూ ఓ పోస్ట్ ద్వారా తెలియజేశారు.