రష్మిక వీడియో పై టాలీవుడ్ సెలబ్రిటీలు సైలెన్స్…. భయమేస్తుంది అంటూ చైతు ట్వీట్…!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమెకి సంబంధించి డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై కేంద్ర మంత్రి, అమితా బచ్చన్, కల్వకుంట్ల కవిత స్పందించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా రష్మిక సైతం ఓ ఎమోషనల్ నోట్ ను షేర్ చేసింది. కానీ టాలీవుడ్ సెలబ్రిటీలు ఏ ఒక్కరు స్పందించలేదు. తాజాగా.. టాలీవుడ్ నుంచి మొదటగా నాగచైతన్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. ” టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది.

భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. బాధితులపై తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలి. మీకు మరింత ధైర్యం, బలం చేకూర్చాలి ” అంటూ రాసుకొచ్చాడు. ఈమెకి సపోర్ట్ గా నిలిచిన నాగచైతన్యకు రష్మిక కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం నాగచైతన్య ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.