రివ్యూ: మంగళవారం సినిమాతో పాయల్ హీట్ కొట్టిందా..!!

డైరెక్టర్ అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో వచ్చిన రెండోవ చిత్రం మంగళవారం. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కావడం జరిగింది మరి ఏ మేరకు ఈ సినిమాతో పాయల్ సక్సెస్ అయిందో చూద్దాం.

స్టోరీ విషయానికి వస్తే మొదట ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం చూపించడం జరిగిందట.. ఒక అగ్ని ప్రమాదంలో అబ్బాయి మరణించగా ఆ తర్వాత కొన్నాళ్ళకి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు మంగళవారం ఊర్లో ఉన్న అక్రమ సంబంధాల గురించి గోడల మీద రాసి వారిని చంపేస్తూ ఉంటారట. దీంతో ఆ హత్యలు వెనుక ఉన్నది ఎవరు.. పోలీసులు ఊరి జనం వెతకడం మొదలు పెడతారట. అలా మంగళవారం ఊరు జనాలకి ఒకరు.. మరో మంగళవారం పోలీసులకు ఒకరు దొరుకుతారు.. అయితే ఈ హత్యలు చేసింది..వీరేనా గోడమీద రాసి ఎందుకు చంపుతున్నారు.. పాయల్ కి ఆ హత్యలకు ఉన్న సంబంధం ఏమిటి అనే విషయం తెలియాలి అంటే తెరమీద చూడాల్సిందే

ఇక ఈ సినిమా మొదటి హాఫ్ అంతా కూడా కామెడీగా సాగుతూ ఉంటుందని అయితే హత్యలు ఎవరు చేశారని విషయంపై సాగిపోతుందని ఇంటర్వెల్ దగ్గర నుంచి హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందని దీని ఆధారంగానే ఈ సినిమా హైలైట్ గా మారింది అని.. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమా పార్ట్ 2 క్లైమాక్స్ ట్వీట్స్ కూడా అదిరిపోయాయని చెప్పవచ్చు. పల్లెటూరు వాతావరణం చాలా చక్కగా చూపించారని బిజిఎం కూడా అదిరిపోయిందని తెలుపుతున్నారు.ఇందులో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉందని కచ్చితంగా ఈ సినిమాతో పాయల్ హిట్టు కొట్టిందని చెబుతున్నారు.