అది లేకపోతే శోభా శెట్టి అస్సలు ఉండలేదట… బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇదేం దరిద్రం రా బాబు…!!

బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి శోభా శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈమె నటించిన ” కార్తీకదీపం ” సీరియల్లో మౌనిత పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందింది. ఈ ముద్దుగుమ్మ కేవలం బుల్లితెర సీరియల్స్ లోనే కాకుండా పలు కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.

ఇక ఈమె కన్నడలో పలు సినిమాలలో కూడా నటించింది. ఇలా సినిమాలలో నటిస్తూ భారీ స్థాయిలో ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తన ఆటతో అందరినీ మెప్పిస్తూ ఇప్పటికీ హౌస్ లో కొనసాగుతుంది. ప్రతి వారం శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ.. తీరా చూసేటప్పటికి శోభా శెట్టి మాత్రం ఎలిమినేట్ అయ్యేదే కాదు.

గత సోమవారం నామినేషన్స్ లో భాగంగా.. అందరూ హడావిడిగా నామినేషన్స్ కి బయటకి వస్తుంటే.. ఈ ముద్దుగుమ్మ మాత్రం లిప్ స్టిక్ వేస్తూ ముస్తాబవుతుంది. ఈ క్రమంలోనే శోభా శెట్టి మేకప్ లేకుండా అసలు ఉండలేదంటూ… ఆమెని మేకప్ లేకపోతే మనం కూడా చూడలేము… ఈమెకి మేకప్ అంటే చాలా ఇష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈమె ఒక పూట అన్నం లేకపోయినా ఉంటుందేమో కానీ మేకప్ లేకుండా ఉండలేదట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.