అప్పుడే ఓటీటి లోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు.. ఎక్కడంటే..?

ఈ ఏడాది ధమాకా, వాల్తేరు వీరయ్య ,రావణాసుర వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రవితేజ తాజాగా దసరా పండుగ కానుకల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ సినిమా 1980లో గజదొంగగా పాపులర్ అయిన స్టువర్తపురం టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ తెరకెక్కించడం జరిగింది. అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. అలాగే అలనాటి హీరోయిన్ రేణు దేశాయ్ కూడా చాలా రోజుల తర్వాత ఇందులో రియంట్రి ఇవ్వడం జరిగింది.

అక్టోబర్ 21 తేదీన థియేటర్లో విడుదలైన టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా కమర్షియల్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటి లో అనుకోకుండా డిజిటల్ స్ట్రిమ్మింగ్ కావడం జరిగింది. దీంతో రవితేజ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ప్రముఖ ఓటీటి ప్లాట్ఫారం అయినా అమెజాన్లో ఈరోజు అర్ధరాత్రి నుంచి టైగర్ నాగేశ్వరరావు సినిమా అందుబాటులో వచ్చిందట. పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో అవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 27న ఈ సినిమా ఓటీటి లోకి వస్తుందని వార్తలు వినిపించాయి.కానీ అనుకున్న దాని కంటే వారం ముందే ఈ సినిమా విడుదల కావడం గమనార్హం. ఈ చిత్రాన్ని అభిషేక అగర్వాల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. రవితేజ తన మార్కుని ఈ సినిమాతో చూపించారు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.