పవన్ కళ్యాణ్ – తరుణ్ కాంబోలో రావాల్సిన సినిమా అదే… కానీ ఎందుకు ఆగిపోయింది?… కారణాలు ఏంటంటే…??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ సుపరిచితమే. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇప్పటివరకు చాలా హిట్లనే ఖాతాలో వేసుకున్నాడు. పవన్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే తరుణ్ కూడా పలు సినిమాలతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్, తరుణ్ కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. కానీ అవకాశాన్ని తరుణ్ మిస్ చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు హీరోలు కూడా అప్పట్లో యూత్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ కి ఏర్పడిన కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తరుణ్ కి మాత్రం ఏర్పడలేదు. లేడీస్, యూత్ కి తరుణ్ బాగా కనెక్ట్ అయ్యాడు. కానీ మధ్యలో సరైన స్క్రిప్స్ కనెక్షన్ లేక వరుస ఫ్లాప్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తరుణ్ గ్రాఫ్ అలా కొద్దికొద్దిగా పడిపోయింది. అనంతరం సినిమాలకి దూరమై వ్యాపార రంగంలో కొనసాగడానికి మక్కువ చూపాడు.

తరువాత హైదరాబాద్ లోనే టాప్ మోస్ట్ ధనవంతులలో టాప్ వన్ లో నిలిచాడు. ఇక 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ” బంగారం ” సినిమా రిలీజ్ అయింది. కానీ కమర్షియల్ గా హిట్ కాకపోయినా.. యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాలో రాజా క్యారెక్టర్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. ముందుగా ఈ పాత్ర కోసం తరుణ్ ని అడిగారట. కానీ తరుణ్ ఆ రోల్ చేయడానికి ఒప్పుకోలేదట. ఇలా తరుణ్ ఈ సినిమాని మిస్ చేసుకున్నాడు.