ఆ పాటను నాలుగు నిమిషాల ముపై సెకండ్‌ల‌లో పూర్తి చేశా.. దేవి శ్రీ ప్రసాద్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఈత‌డి పేరు వినిపించేది. తన మ్యూజిక్ తో ప్రేక్షకులను డ్యాన్స్ చెపించాడు డిఎస్పి. దేవి కంపోజ్ చేసిన సాంగ్స్‌కి ఇప్పటికీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. దేవిశ్రీ అందించిన‌ మ్యూజిక్ సినిమాల విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇటీవల ఆయన పాటలకు జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు. పుష్ప సినిమాలో ఆయన మ్యూజిక్‌కి ఈ అవార్డు దక్కింది. సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు అల్లు అర్జున్‌కు కూడా బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ వ‌చ్చింది.

పుష్ప సినిమాలో సాంగ్స్ అన్ని కూడా వేరే లెవెల్‌లో ఉంటాయి అనడంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఉ అంటావా మామ ఊఊ అంటావా మామ అనే స్పెషల్ సాంగ్, శ్రీవల్లి సాంగ్ ఎంతో పాపులర్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ హుక్ స్టెప్ కు సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫిదా అయిపోయారు.

తాజాగా డిఎస్పి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ కేవలం నేను ఐదు నిమిషాల లోపే పూర్తి చేశానని.. నాకు ఈ పాటను పూర్తి చేయడానికి 4 నిమిషాల 30 సెకండ్లు పట్టిందంటూ వివరించాడు. గిటార్ తో ముందుగా ఈ పాటను హమ్మింగ్ చేశానని.. మూవీలో హీరోయిన్ పేరు శ్రీవల్లి కావడంతో పేరు కూడా ఈ మ్యూజిక్‌లో ఇంక్లూడ్ చేశానని.. అయితే అతి తక్కువ సమయంలో చేసిన ఈ సాంగ్ ఎంతో పాపులర్ అవడం చాలా సంతోషాన్ని కల్పించిందంటూ వివరించాడు డిఎస్పి.