అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. అయాన్ జాతకం ఎలా ఉందంటే..?!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి జంట ఒకటి. వీరికి అల్లు అయన్‌, అల్లు అర్హ ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అర్హ ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం సినిమాల్లో బాల భరతుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ సినిమా సక్సెస్ అందుకోకపోయినా అర్హ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఫ్యూచర్లో అల్లు అర్హ పెద్ద హీరోయిన్ అవుతుంది అంటూ చాలామంది విమర్శకులు ప్రశంసలు అందించారు. ఆమె నటనకు పాజిటివ్ టాక్ వచ్చింది.

ఇక తాజాగా అల్లు అర్జున్ కుమారుడు అయాన్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అల్లు అర్జున్ వారసుడిగా అయ్యాన్‌ ఇండస్ట్రీలోకి వస్తారని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే అయాన్ కు సినిమా ఇండస్ట్రీ అంతగా అచ్చు రాదని.. అత‌డు సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదని.. ఒకవేళ వచ్చినా సక్సెస్ కాడంటూ.. అతని జాతకంలో ఉందట. అయితే రాజకీయాల పరంగా అయాన్ అడుగు వేస్తే అతను సంచలనాలను సృష్టిస్తాడని.. రాజకీయపరమైన జీవితం అతనికి బాగా అచ్చు వస్తుందని.. అతని జాతకంలో ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఓ పాన్ ఇండియా స్టార్ హీరో కుమారుడు ఇండస్ట్రీలోకి రాకపోవడం ఏంటి అంటూ అందరూ షాక్ అవుతున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఇది ఎవరో కావాలనే క్రియేట్ చేశారని.. సినిమాల్లో పైకి రాని వ్యక్తి రాజకీయాల్లో పైకి వస్తాడంటూ.. కావాలనే అల్లు అయాన్‌ను ఫోకస్ చేస్తూ.. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారంటూ మండిపడుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అయితే ఇంకా పది ఏళ్ల వయసన్న నిండకుండా ఉన్న చిన్న బాబు గురించి ఇలాంటి అబద్ధపు వార్తలను ప్రచారం చేయడం ఏమాత్రం సరి కాదంటూ బన్నీ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.