మెగా కోడలు ఉపాసన.. చరణ్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ రిజెక్ట్ చేసిందా..

మెగా కోడలు ఉపాసనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పిటల్స్ అదినేత‌గా.. వేలకోట్ల ఆస్తికి అధిపతి అయిన ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని పెళ్లి చేసుకుని.. 12 సంవత్సరాల నుండి అతనితో మ్యారేజ్ లైఫ్ ను గడుపుతుంది. ఈ దంపతులకు ఇటీవలే క్లిన్ కారా అనే ఒక పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారి మెగా కుటుంబంలో అడుగుపెట్టడంతో కుటుంబం మొత్తం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉపాసన భర్తకి సంబంధించిన వ్యక్తిగత విషయాలను చూసుకుంటూనే.. మరొక పక్క క్లినిక్ కార బాధ్యతలను, అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను చూసుకుంటుంది.

ఇలా ఒకేసారి మల్టీ టాస్క్‌ల‌ను బాధ్యతగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఉపాసన.. గతంలో రామ్ చరణ్ నటించిన సినిమాలో హీరోయిన్ అవకాశం వస్తే రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఎందుకు రిజెక్ట్ చేసిందో.. ఒకసారి చూద్దాం. ఇక ఉపాసన రామ్‌చరణ్‌ను వివాహం చేసుకోక ముందే.. సినిమాల్లోకి రావాలని ప్రయత్నించిందట. రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుత సినిమాలో ఉపాసననే హీరోయిన్గా తీసుకోవాలని మేకర్స్ భావించారట.

కానీ సినిమా ఇండస్ట్రీ మనకి అచ్చిరాదు.. వైద్య రంగంలోనే మంచి స్టేజ్లో ఉండగలం అంటూ ఆమె తల్లిదండ్రులు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ బాధ్యతలను ఉపాసనకు అప్పజెప్పారట. దీంతో హీరోయిన్ కావ్వాల్సిన ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా మారి ఆ హాస్పిటల్స్ అన్ని విధాల ఎవరు ఊహించనంత ఇంప్రూవ్ చేసింది. అలాగే ఈ హాస్పిటల్స్ ద్వారా ఉపాసన ఎన్నోవేల మంది పేదలకు కూడా సహాయం చేసింది. ఉచిత వైద్యం అందించిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇలా మంచి మనసును చాటుకునే అమ్మాయి కాబట్టే మెగా ఫ్యాన్స్ అంతా మెగా హీరోలకు మించి ఉపాసనని ఇష్టపడతారు.