తన ఛానల్ వ్యూస్ కోసం ఆదిరెడ్డి మా అక్కని వాడుకుంటున్నాడు.. రతిక సిస్టర్ సెన్సేషనల్ కామెంట్స్..

బిగ్‌బాస్ రివ్యూవ‌ర్‌ ఆదిరెడ్డికి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్గా వ్యవహరించిన ఆదిరెడ్డి ఆ సీజన్ ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తర్వాత హౌస్ నుంచి బయటికి వచ్చిన ఆదిరెడ్డి బిగ్‌బాస్ తర్వాత సీజన్‌లో రివ్యూలను యూట్యూబ్ వీడియోలు ద్వారా షేర్ చేసుకుంటూ బాగా సంపాదిస్తున్నాడు. ఇక ఈ సీజన్ కు సంబంధించిన ఎపిసోడ్‌ల‌కు రివ్యూలను కూడా వరుసగా షేర్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆదిరెడ్డి షేర్ చేస్తున్న వీడియోలపై ర‌తిక సిస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వీడియోస్ పై రతిక సిస్టర్ స్పందిస్తూ ఆదిరెడ్డి పై ఫైర్ అయ్యింది.

మా అక్కను బ్యాడ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా.. మీ కుటుంబంలో కూడా ఓ అమ్మాయి కష్టపడి పైకి వచ్చి తన గురించి బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి విషయంలో మీరు ఎలా బాధపడతారో.. మా ఫీలింగ్ కూడా అదే విధంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. భారీ వ్యూస్ కోసం మా అక్కను బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ వివరించిన ఆమె.. ఆది రెడ్డి అనే యుట్యూబర్‌ ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చాడు.. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు.

తన వ్యూస్ కోసం మా అక్క గురించి కావాలనే తప్పుడు రివ్యూస్ ఇస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం మా అక్కను మాత్రమే టార్గెట్ చేస్తూ బ్యాడ్ రివ్యూస్ ఇచ్చే అంత తప్పు మా అక్క ఏం చేసింది అంటూ ప్రశ్నించింది. అత‌ను బిగ్ బాస్ లో పరిస్థితులు స్పష్టంగా తెలిసి కూడా తన అక్క గురించి నెగటివ్ రివ్యూస్ ఇస్తున్నాడు అంటే అది కేవలం తన వీడియోలకు వ్యూస్ రావడం కోసమే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రతిక సిస్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.