వైలెన్స్ తో ఎమోషనల్ భయపెట్టేస్తున్న యానిమల్ ట్రైలర్..!!

సినిమా ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో క్యూరాసిటోజితో ఎదురుచూస్తున్న యానిమల్ మూవీ ట్రైలర్ రానే వచ్చేసింది. సుమారుగా 3:32 సెకండ్ల నిడివి తో ఉన్న ఈ ట్రైలర్ భారీ అంచనాలను చేరుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ట్రైలర్ యాక్షన్స్ అన్ని వేషాలు రణవీర్ డైలాగులు మేకవర్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే బాండింగ్ నెక్స్ట్ లెవెల్ లో చూపించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ముఖ్యంగా తన తండ్రిని ఎవరు తప్పుగా అర్థం చేసుకున్న ఎవరు ఏమనుకున్నా రణబీర్ మాత్రం తట్టుకోలేక చాలా కోపంతో ఉండే కొడుకు పాత్రలో చూపించారు.

ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య సన్నివేశాలు కూడా నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని చెప్పవచ్చు డైలాగులు కూడా భారీగానే ఆకట్టుకుంటున్నాయి.. హీరోయిన్ రష్మిక కూడా రణబీర్ ను తిట్టే వాటిలో కూడా డైలాగులు హైలైట్ గా కనిపిస్తూ ఉన్నాయి. చివరిలో చూపించిన యాక్షన్ సీన్స్ మోస్ట్ హైలెట్గా కనిపించేలా ఉన్నాయి ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే చివరిలో రణబీర్ భారీ మెషిన్ గన్నుతో ఎంటర్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్ లో కాలుస్తూ ఉంటారు.

ఇప్పటివరకు ఇలాంటి మెసేన్ గన్ ఏ సినిమాలో కూడా ఉపయోగించినట్లు కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా యాక్షన్ ఫార్మాట్ లోనే చాలా హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది. ట్రైలర్ చివరిలో రణబీర్ ,బాబి డియోల్ తలపడే షాట్లు కూడా అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. డైరెక్టర్ సందీప్ ఇందులో విలన్ క్యారెక్టర్ ని కూడా చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లుగా కనిపిస్తున్నది. డిసెంబర్ ఒకటవ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.