” ఐశ్వర్య రాయ్ ను అలా చేస్తా అన్నాడు.. మరి ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు ” … చిన్మయి సెన్సేషనల్ కామెంట్స్…!!

హీరోయిన్ త్రిష పై నటుడు మన్సూర్ ఆలీ ఖాన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో తెలిసిందే. దీంతో త్రిష కు మద్దతుగా బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కూడా అండగా నిలిచింది. ఇక రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇక ప్రస్తుతం ఈ ఇష్యుపై సింగర్ చిన్మయి మరోసారి స్పందించింది. చిన్మయి మాట్లాడుతూ…” ఇప్పుడు మన్సూర్ ను ఇంతలా తప్పు పడుతున్నారు.

ఒకప్పుడు ఇంతకంటే ఘోరంగా నటుడు రాధా రవి మాట్లాడినప్పుడు మీరంతా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ” అంటూ ప్రశ్నించింది. ఇక రీసెంట్ గా ఓ ఈవెంట్లో పాల్గొన్న రాధా రవి…” నాకు హిందీ రాదు‌. ఒకవేళ వచ్చి ఉంటే ఐశ్వర్య రాయ్ ను రేప్ చేసే వాడిని. ఎందుకంటే హిందీ వాళ్లకు అలాంటి పాత్రల కన్నా మంచి పాత్రలు ఇవ్వరు కదా? ” అంటూ రాధా రవి చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా పగలబడి నవ్వారు.

ఇక ప్రస్తుతం చిన్మయి ఈ వీడియోను షేర్ చేస్తూ…” ఐశ్వర్య రాయ్ గురించి మాట్లాడినప్పుడు ఆ మాటలు జోక్ గా తీసుకున్నవారు. ఇప్పుడు మన్సూర్ చేసిన వ్యాఖ్యలను కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి రాధా రవి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. దానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఉంది ” అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది.