ఈరోజే ఓటిటిలోకి వచ్చేస్తున్న బాలయ్య భగవంత్ కేసరి.. ఎక్కడంటే..?

బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భగవంత్ కేసరి సినిమా మరికొన్ని గంటలలో ఓటీటి లోకి రాబోతోంది. నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా అమెజాన్ ప్రైమ్ ఒక పోస్టర్తో విడుదల చేయడం జరిగింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించాగ శ్రీ లీల కీలకమైన పాత్రలో నటించింది.

ముఖ్యంగా తండ్రి కూతుర్ల సెంటిమెంటుతో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. గత కొద్దిరోజులుగా భగవంత్ కేసరి సినిమా ఈనెల 23 లేదా 25 నుంచి స్త్రిమ్మింగ్ అయ్యేందుకు ఎక్కువగా ఆస్కారం ఉందని వార్తలు వినిపించాయి. కానీ నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ఓటీటి లోకి తీసుకువస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక బీట్ సాంగ్ కూడా ఉందని ఇది థియేటర్లో ప్రదర్శించలేనంత ఇప్పుడు ఓటిటి వర్షన్ లో మాత్రమే ఆ సాంగ్ ఉంచబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా సెన్సార్ బోర్డు కట్ చేసిన కొన్ని డైలాగులు సన్నివేశాలను కూడా ఇందులో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించగా… శుభలేఖ సుధాకర్ రాహుల్ రవి శరత్ కుమార్ రఘు బాబు తదితరులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం జరిగింది ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.