నేడు అనిల్ రావిపూడి పుట్టినరోజు… ఈయన కెరీర్ ను గుర్తు చేసుకుంటున్న ప్రేక్షకులు…?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకులు ఎంతోమంది ఉన్నప్పటికీ.. ఫన్ పేరు ఎత్తితే ముందుగా గుర్తుకొచ్చేది అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ఈయన .. అనంతరం వ‌ర‌స‌ విజయాలతో దూసుకుపోయాడు. వెంకటేష్, వరుణ్ తో కలిసి ” ఎఫ్ 2 ” చేసిన ఈయన మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇక తాజాగా బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్గా నటించిన మూవీ ” భగవంత్ కేసరి “. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓ ఊపు ఊపింది అనే చెప్పాలి. టాలీవుడ్ స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్స్ అన‌గానే ప్రతిష్టాత్మక మూవీ బాహుబలి సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి అనంతరం వినిపించేది అనిల్ రావిపూడి పేరే.

ఇక నేడు అనిల్ రావిపూడి పుట్టినరోజు. ఈయన నేటితో 40 ఏళ్ళు పూర్తి చేసుకుని 41వ సంవ‌త్స‌రంలోకి ఎంట్రీ అడుగుపెట్టాడు. దీంతో ఈయన జీవిత గాధను నెమర‌ వేసుకుంటున్నారు ప్రేక్షకులు. ఇక ప్రస్తుతం ఈయన తెరకెక్కించిన సినిమాలు, ఈయన మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.