ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కే జి ఎఫ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రజలలో కూడా భారీ హైప్ నెలకొంది. మరికొద్ది వారాల్లో ఈ సినిమా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై కొన్ని ఆసక్తికర అప్డేట్స్ కూడా బయటకి వస్తున్నాయి.
ఇక తాజాగా ప్రభాస్ కో స్టార్ అయిన యంగ్ హీరోయిన్ హన్సిక ఓ ఇంటర్వ్యూలో సలార్ మూవీ గురించి చేసిన కామెంట్స్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆశక్తి పెంచాయి. ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో మీరూ వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందా అనగానే.. హన్సిక సలార్ ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా కోసం నాకు చాలా ఆసక్తిగా ఉంది. దీనికి సంబంధించిన చాలా విషయాలు నాకు తెలుసు.
ఈ సినిమాలో యాక్ట్ చేసిన శ్రేయ రెడ్డి నా క్లోజ్ ఫ్రెండ్. చాలా విషయాలు నాకు వివరించింది. అవన్నీ మీకు చెప్పలేను గాని సల్లర్ పార్ట్ వన్ సూపర్ గా ఉంటుంది. ఇక పార్ట్ 2 అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది అంటూ.. ఆమె వివరించింది. దీంతో సలార్ సినిమా విషయంలో హన్సిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో ఆ రేంజ్ లో ఆసక్తికర విషయాలు ఏమై ఉంటాయి..? సినిమా ఎలా ఉండబోతుందో..? ఆ విషయాలు ఏంటో..? అని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.