ఈ ఊరిలో జీవించాలంటే 25 లక్షలు ఎదిరించి మరీ ఆహ్వానిస్తారు.. కార‌ణం ఇదే..

ఇటలీ దక్షిణ ప్రాంతమైన కలాబ్రియా ఓ అద్భుతమైన సముద్ర తీర ప్రాంతం. సౌందర్యం పర్వత, ప్రకృతి చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. టోయ్ ఆఫ్ ఇటలీగా పిలవబడే ఈ ఏరియా గత కొద్ది ఏళ్లుగా అతి తక్కువ జనాభా సమస్య ఎదుర్కొంటుంది. పట్టణాలు కనీసం 5000 మంది కూడా నివసించని పరిస్థితి ఉండడంతో ఈ సమస్యను పరిష్కరించడానికి అక్కడి అధికారులు ఓ డిఫరెంట్ ఆలోచనతో ముందుకు వచ్చారు. ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఈ గ్రామాల్లో జీవించాలనుకునే 40 సంవత్సరాలు కంటే తక్కువ వయసున్న వ్యక్తులకు దాదాపు రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. అయితే దరఖాస్తుదారులు దరఖాస్తు ఆమోదం పొందిన 90 రోజుల్లో ఈ ప్రదేశానికి వెళ్లడానికి రెడ్డీ అవ్వాలి. ఆ ప్రాంతంలో వ్యాపారాన్ని మొదలుపెట్టాలి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్ గా స్టార్ట్ అప్ లేదా ప్రాంతీయ వృత్తులకు సపోర్టివ్ గా పని చేయాలి. అయితే రెస్టారెంట్లు, దుకాణాలు, బెడ్స్, బ్రేక్ ఫాస్ట్ లు హోటల్లు వంటి వ్యాపారాలపై ఈ ప్రాంతం అధికారులు ప్రత్యక్షించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఈ ఆలోచన వెనుక సూత్రధారుల్లో ఒకరైన జియాన్ లూకా గాల్లో.. లోకల్ ఎకానమీ సిస్టంను యాక్టివ్ చేసేందుకు ఈ చిన్న స్థాయి వ్యాపారాలను రీస్టార్ట్ చేయడం ప్రాథమిక లక్ష్యం అని చెబుతున్నారు. యాక్టివ్ రెసిడెన్సి ఇన్కమ్ గా పిలవబడే ఈ ఇనిషియేటివ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారట. ఎందుకోసం రూ.6.31 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతం రీస్టార్ట్ కు ఈ ఐడియా తప్పకుండా హెల్ప్ అవుతుందని గాలో సివాట‌, సమో, ప్రికాకోర్‌, ఐయేటా, బోవా, క‌క్యూరీ, అల్బిడోనా, శాంట స‌వ‌రీనా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారట‌.