అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత కూడా రిలీజ్ కానీ టాలీవుడ్ స్టార్‌హీరోల సినిమాలు ఇవే..

సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలకు బడ్జెట్ ప్రాబ్లం వచ్చి సినిమా ప్రారంభమై కొంత షూట్ జరిగిన తర్వాత ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ స్టార్ హీరోల సినిమాలు ఒక్కసారి కమిట్ అయితే పూర్తిగా ప్రాజెక్టును కంప్లీట్ చేస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సినిమా రిలీజ్ అవుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోల సినిమాలు కూడా షూటింగ్ ప్రారంభించి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా మొత్తం 11 సినిమాలు ఆగిపోయాయి. ఒకప్పుడు ఎంతో గ్రాండ్ గా ప్రారంభించిన పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి సినిమా ముహూర్తం ఫిక్స్ అయి చివరి నిమిషంలో ఆగిపోయింది.

బాలకృష్ణ నర్తనశాల సినిమా 15 రోజుల షూటింగ్ జరుపుకున్న తర్వాత పక్కన పెట్టేసారు. రామ్ చరణ్ మెరుపు సినిమా కొన్ని రోజుల షూటింగ్ కి ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ సంగీతం శ్రీనివాస్ కాంబినేషన్లో జీసస్ క్రైస్ట్ జీవిత ఆధారంగా తెర‌కెక్కాల్సిన సినిమా కూడా పక్కన పెట్టేశారు. కొరటాల శివ – రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత ఆగిపోయింది. రాంగోపాల్ వర్మ – చిరంజీవి కాంబోలో వినాలని ఉంది సినిమా కూడా కొన్ని రోజులు షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఏవో కారణాలతో ఆపేశారు.

చిరంజీవి అబూబ బగ్దాద్, మెహర్ రమేష్ – రవితేజ కాంబో, అలాగే వెంకటేష్ – మారుతి – రాధా కాంబో, బాలకృష్ణ – బి.గోపాల్ హర హర మహదేవ మూవీ, బాలయ్య.. విక్రమ సింహభూపతి సినిమాలు కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత అనివార్య‌ కారణాలతో ఆగిపోయాయి. అయితే ఆగిపోయిన ఈ సినిమాలపై ఇప్పటివరకు ఈ స్టార్ హీరోలు ఎవరు స్పందించకపోవడం గమనార్హం. ఇక బాలకృష్ణ నర్తనశాల సినిమాకు దర్శకత్వం వహించాలి అనుకున్నారు అది కూడా జరగలేదు.