దీర్ఘాయుష్ అంటే ఎంతకాలమో తెలుసా..?

మనిషి ఆయుషుకి సంబంధించి ఎప్పటికప్పుడు రీసెర్చ్‌లు జరుగుతూనే ఉంటాయి. తాజాగా డచ్ ప్రయోగంలో మానవుడి గరిష్ట వయసు ఎంత అనే విషయంపై.. దీర్ఘాయువు వెనకాల గల రహస్యంపై.. కొన్ని విషయాలు బయటపడ్డాయి. ప్రోటీన్ ఫుడ్, లైఫ్ స్టైల్, మోడ్రన్ టెక్నాలజీతో ఆయుర్దాయం పెరుగుతుందని.. ఈ ప్రయోగం ద్వారా కనుగొన్నారు. డిఫ‌రెంట్ వెదర్స్ లో మరణించిన 75 వేల మంది డచ్ పౌరుల డేటాను ఆధారంగా శాస్త్రవేత్తలు ఇది నిర్ధ‌రించారు. చనిపోయే టైంలో వారి వయసు పరిగణలోకి తీసుకొని శాస్త్రవేత్తలు ఈ రిపోర్టును అందించారు. రోటర్‌డాం, దిల్బర్గ్ ఎరాస్మస్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టాట‌స్టిక్ ప్రొఫెసర్ తమ పరిశోధన ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 117.7 ఏళ్లని కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని వివరించారు.

దీన్ని బట్టి పురుషుల కంటే స్త్రీల ఆయుష్ కాస్త గట్టిగానే ఉంటుందట‌. మూడు దశాబ్దాల డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు మానవుని మినిమం లైఫ్ టైం ని అంచనా వేశారు. ఈ ప్రయోగాన్ని చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన జాన్ ఐస్ మహ్లే మాట్లాడుతూ సాధారణంగా ప్రజలు చాలా కాలం జీవిస్తారు. గత 30 ఏళ్లలో మనిషి ఆయుషు పెరుగుతూ వచ్చింది. వృద్ధాప్యం దూరమైంది. నెదర్లాండ్లో 95 పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు. మనిషి ఆయుష్ అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొల‌మానం అంటారు. ఈ డ‌చ్ పరిశోధన గత ఏడది అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలనే పోలి ఉన్నాయి.

అమెరికా శాస్త్రవేత్తలు కూడా ఇదే గరిష్ట వయోపరిమితిని చెప్పారు. అయితే తమ దేశం లో ఇప్పుడు వృద్ధులు తమ పూర్వికుల్లా ఎక్కువ కాలం జీవించడం లేదని వారు చెప్పుకొచ్చారు. ఇక్కడ డచ్ పరిశోధకులు ఎక్స్ట్రీ వాల్యూ థియరీ అని ప్రత్యేక స్టాట‌స్టిక్స్‌ విధానాన్ని ఉపయోగించి ఈ డేటాను విశ్లేషించారు. వివిధ సందేహాలను తీర్చేందుకు ఇది ఉపకరిస్తుంది. 122 సంవత్సరాల 164 రోజుల పాటు జీవించిన ఓ మ‌హిళ‌ సూపర్ సెంటెన్ ఏరియస్ జీన్ కాన్వెంట్ ఆయుష్ అడ్డుపడే అన్ని అడ్డంకులను దాటారని శాస్త్రవేత్తలు ఉదాహరణ చెప్పారు. ఇప్పటివరకు జీన్ కాన్వెంట్ అత్యధిక కాలం జీవించిన మహిళగా చరిత్రలో నిలిచింది. ఐస్ మహ్లే మార్గదర్శకత్వం లో జరుగుతున్న ఈ ఎక్స్పరిమెంట్ సంబంధించిన వివరాలు త్వరలోనే పూర్తిగా పబ్లిష్ అవుతాయి.