నాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన మూవీ హాయ్ నాన్న. మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా, బేబీ కియారా కీరోల్‌లో నటించిన ఈ మూవీ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచాడు నాని. దీపావళి సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూ రిలీజ్ చేసిన నాని సినిమాలో తన కూతురుగా నటించిన బేబి కియారాతో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలన్ను చెప్పుకొచ్చాడు. ప్రతి సినిమాకు ఒకేలా ప్రమోషన్ చేస్తానని.. కానీ కొన్ని సినిమాలకు మాత్రం కాస్త గట్టిగా చెబుతానని అలాంటి టైంలో ఆడియన్స్ కూడా నా నమ్మకానికి కలిసి వచ్చారని వెల్లడించాడు.
రిలీజ్‌కు ముందు అన్ని సినిమాల కథ గొప్పగా ఉందని సినిమా బాగుందని చెప్తూ ఉంటాము. కొన్నిసార్లు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం.. కానీ ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండము. అలా కాన్ఫిడెంట్‌గా చెప్పే సినిమాలో హాయ్ నాన్న ఒకటి. నేను గతంలో ఏదైనా సినిమా గురించి గట్టిగా చెప్పి.. నన్ను నమ్మి థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. ఈసారి కూడా గట్టిగానే చెప్తున్నా.. ప్రామిస్ కూడా.. హాయ్ నాన్న చాలా స్వీట్ మూవీ, ఆడియన్స్ ఫుల్ గా సాటిస్ఫై అవుతారు.
మూవీ మోత మోగిపోద్ది.. నాది గ్యారెంటీ అంటూ చెప్పుకొచ్చాడు. హాయ్ నాన్న మూవీ పై తన నమ్మకాన్ని వ్యక్తం చేసిన నాని.. ఫుల్ ఫీల్డ్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మీరు ఈ సినిమాలో చూస్తారు. మంచి మ్యూజిక్ తో, గ్రాండ్ విజువల్స్ తో బిగ్ స్క్రీన్ పై ఇలాంటి ఫ్యామిలి ఎమోషన్స్ చూసి చాలా కాలం అయింది. మళ్ళీ ఆ రోజున గుర్తు చేసుకునేలా హాయ్ నాన్న మూవీ ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.