టైగర్ -3 సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

గత కొద్దిరోజులుగా బాలీవుడ్ ప్రేక్షకుల సైతం ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రాలలో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ -3 సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్గా కత్రినా కైఫ్ నటించిన ముఖ్యంగా ఈమె టవల్ సన్నివేశం గత కొద్దిరోజుల నుంచి హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. దీపావళి కానుకగా నవంబర్ 12వ తేదీన ఈ సినిమా విడుదలై అన్ని భాషలలో కూడా మిక్స్డ్ టాకును తెచ్చుకోవడం జరిగింది. దీంతో పండుగ కానుక విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకునే ఓపెనింగ్ కలెక్షన్స్ ఫలితం నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి రోజు 40 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 5500 స్క్రీన్ లతో ఓవర్సీస్ లో 3400 స్క్రీన్ లలో టైగర్-3 విడుదల కావడం జరిగింది.. ఈ సినిమా మొదటిరోజు అన్ని భాషలలో 44.50 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయిన టైగర్-3 చిత్రం అభిమానులను ఆనందానికి అవధులు లేకుండా చేసినట్లు తెలుస్తోంది.

మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని పలువురు సినీ ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ మనీష్ శర్మ దర్శకత్వం వహించారు.. ఆదిత్య చోప్రా కథ స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. ఎస్ రాజ్ ఫిలిం బ్యానర్ పైనఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కీలకమైన పాత్రలో షారుక్ ఖాన్ కూడా నటించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరి ఎన్ని రోజులలో రాబడుతుందో చూడాలి మరి.