18 ఏళ్ల తర్వాత ఫస్ట్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న తమన్నా..

సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ తమన్న 2005లో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదట హిందీ సినిమాతో ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఏడాదిలోనే టాలీవుడ్‌కి అడుగుపెట్టింది. అయితే ఆమె టాలీవుడ్ లో నటించిన మొదటి రెండు సినిమాలు సక్సెస్ అందుకోలేకపోయాయి. తర్వాత తమిళ్లో ఆఫర్ ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. కానీ 2007లో తెలుగులో రూపొందిన హ్యాపీడేస్ మూవీతో ఆమె మంచి సక్సెస్ అందుకుంది. ఇక అప్పటినుంచి వరుస అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్ర హీరోయిన్గా మారింది. తెలుగు అగ్ర హీరోల అందరితో నటించింది.

ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ఇప్పటికి ఇండస్ట్రీలో అడుగుపెట్టి 18 ఏళ్లు అవుతుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి భాషలో నటించిన తమన్న సౌత్ స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే ఈమె కేవలం మలయాళ భాషలో మాత్రమే నటించలేదు. ఇక‌ సినీ కెరీర్ కూడా ముగింపుకొచ్చింది. ఇక మలయాళ సినిమాలో తమన్నా ఎప్పటికీ నటించదు అని చాలామంది భావించారు. అయితే తాజాగా దిలీప్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ బాంద్రా సినిమాతో తమన్నకు హీరోయిన్గా అవకాశం దక్కింది. 18 ఏళ్ల తర్వాత మ‌ళ‌యాళ మూవీ మొదటి అవకాశాన్ని అందుకుంది తమన్నా. ఈ సినిమాపై పెద్ద అంచనాలు లేకపోయినా రిలీజ్ అయిన మొదటి రోజే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.

గ‌త శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ ఓపెనింగ్ కూడా నమోదైనట్టు బాక్స్ ఆఫీస్ వర్గాల నుంచి సమాచారం. ఇలా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన 18 ఏళ్ల తర్వాత మిల్కీ బ్యూటీ మలయాళ సినీ ఇండస్ట్రీలో మొదటి హిట్ అందుకుంది. నటించిన ఒక్కగానొక్క సినిమానే మంచి సక్సెస్ అందుకోవడంతో తమన్నా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ప్రస్తుతం తమన్నా హిందీ తో పాటు అన్ని భాషల్లోనూ సక్సెస్ సాధించిన స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. తెలుగు, హిందీ భాషల్లో సినిమా అవకాశాలు రాని తరుణంలో మలయాళం లో హిట్ పడడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.