నువ్వే మా అధినేత, మా నాయ‌కుడు నేను నీతో పోల్చుకోలేను.. ర‌జినీపై అమితాబ్‌ కామెంట్స్ వైర‌ల్‌..

రజనీకాంత్ తో కలిసి పని చేయడంపై తాజాగా అమితాబచ్చన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ నువ్వే అధినేతవి, నాయకుడివి, పెద్దవి, నీతో నేను పోల్చుకోలేను అంటూ వ్యాఖ్యానించారు. 33 ఏళ్ల తర్వాత అమితాబచ్చన్ తో పనిచేయడం పట్ల రజినీకాంత్ ఎగ్జైటింగ్ అంటూ నోట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తను మెంటర్‌అని.. ఆయనతో పనిచేయడం పట్ల తాను ఎక్సైటెడ్ గా ఉన్నట్లు.. చాలా ఆనందంగా ఉన్నట్లు రజిని వివరించాడు. దీంతో అమితాబచ్చన్ దానికి రిప్లై ఇచ్చారు.

బిగ్‌బి మాట్లాడుతూ రజనీకాంత్ సార్ మీరు నా పట్ల చాలా దయ చూపుతున్నారు. సినిమా టైటిల్ ని చూడండి తలైవార్ 170. దాన్ని అర్థం చూస్తే మీరే లీడర్, హెడ్ చీఫ్, నువ్వే అధినేత, నాయకుడు, పెద్ద ఎవరికైనా ఈ విషయంలో డౌట్ ఉందా..? నేను నీతో పోల్చుకోలేను.. మళ్లీ నీతో కలిసి పని చేయడం చాలా గర్వంగా ఉంది అంటూ అమితాబచ్చన్ రాసుకొచ్చాడు. తలైవార్ 170 మూవీ కోసం వీరిద్దరు కలిసి పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నాడు రజిని. అమితాబ్‌తో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటూ.. 33 ఏళ్ల తర్వాత డిజె జ్ఞానవేల్ డైరెక్షన్లో రాబోయే లైకా మూవీ తలైవ‌ర్‌170లో నా మెంటర్‌ అమితాబచ్చన్ తో కలిసి నేను వర్క్ చేయబోతున్నాను.. చాలా సంతోషంగా ఉంది.. నా గుండె ఆనందంతో నిండిపోయింది.. అంటూ ట్విట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ తోపాటు అమితాబచ్చన్ రిప్లై కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.