దొండకాయలు తినడం వల్ల బోలెడు లాభాలు..!!

సాధారణంగా మన చుట్టూ దొరికేటువంటి ఆకుకూరలు పండ్లలో ఎన్నో అవసరమైన పోషకాలు ఉంటాయి. అలాంటి వాటిలో దొండకాయ కూడా ఒకటి.. ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుచేతనే అక్కడి ప్రజలు వీటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. దొండకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

దీర్ఘకాలంగా అజీర్ణం లేదా మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడేవారు దొండకాయ చాలా చక్కని పరిష్కారమని చెప్పవచ్చు. ఇందులో నీరు శాతం ఎక్కువగా ఉండడమే కాకుండా ఫైబర్ కంటెంట్ జీర్ణ క్రియ కు సంబంధించిన అనేక సమస్యలను దూరం చేస్తుంది.

దొండకాయ తినడం వల్ల మధుమేహం రాకుండా ఉంటుంది.. అందుకే పూర్వీకులు కూడా దొండకాయను తరచూ ఎక్కువగా తినే వారట. అయితే 2009లో నిర్వహించిన వైద్య పరీక్షలలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం దొండకాయలలో ఉందని నిరూపించబడిందట.

ఆయుర్వేదంలో కూడా తీగ పండ్లకు మరియు ఆకులకు సైతం చాలా ప్రాముఖ్యత ఉంటుంది.. మధుమేహం ఎక్కువగా ఉన్నవారు ప్రతిరోజు దొండకాయ రసం తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.

ఇండియా, బంగ్లాదేశ్ వంటి ప్రాంతాలలో ఆస్తమా మరియు బ్రూనైటీస్ వంటి శ్వాసకు సంబంధించిన వ్యాధులను ఉపశమనం పొందడానికి దొండకాయ పండ్ల ను చికిత్సగా ఉపయోగించారట. ఈ విషయం చైనీస్ జర్నల్ ఆఫ్ నేచురల్ మెడిసిన్ లో 2011 లో ఒక అధ్యయనంలో ప్రచురించబడిందట. ఈ దొండకాయలలో స్టెరాయిడ్లు, ఆల్కహాయిడ్స్ ,గ్లైకోసైడ్స్ ఉన్నాయని పరిశోధకులు తెలియజేశారట. వీటిని ఎలుకల మీద ప్రయోగం చేసి అలర్జీ, ఆస్తమా వంటి సమస్యలను తగ్గించారట.

ప్రస్తుత కాలంలో ఎక్కువగా క్యాన్సర్ తో పోరాడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో నయం కాలినటువంటి ఈ క్యాన్సర్ తో పోరాడేటువంటి శక్తి దొండకాయలు ఉండేటువంటి ప్రోటీన్స్ కు చాలానే ఉంటుందట. అందుకే ప్రతి ఒక్కరు కూడా వీటిని తినడం మంచిది.