మీడియాకు క్షమాపణలు చెప్పిన సుమ.. కారణం ఇదే..!

తెలుగు బుల్లితెర ఫిమేల్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూ భారీ క్రేజ్‌ను దక్కించుకున్న సుమ.. ఇటీవల మీడియాకు క్షమాపణలు చెబుతూ వీడియో పోస్ట్‌ని షేర్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమైంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్న.. మీరంతా కష్టపడి పని చేస్తారని నాకు తెలుసు. మీరు నేను కలిసి కొన్నాళ్ల నుంచి ప్రయాణిస్తూనే ఉన్నాం.

నన్ను మీరు కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల ఆదికేశవ మూవీ లీలమ్మ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఈవెంట్ కు సుమ యాంకర్ గా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో మీడియా వారు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారని ఫన్నీ కామెంట్స్ చేసింది. దానిపై స్పందించిన విలేకరులు అలా అనకుండా ఉంటే బాగుండేదని మాట్లాడటంతో.. చాలాకాలంతో మీతో కలిసి ప్రయాణిస్తున్నానని.. ఆ చదువుతోనే జోక్ గా మాట్లాడానని సుమ చెప్పుకొచ్చింది.

మీరు స్నాక్స్ ని స్నాక్స్ లాగా తింటున్నారు ఓకేనా..? అంటూ సుమా అడగ్గా.. ఇదే వద్దనేది మీ యాంకరింగ్ అందరికీ ఇష్టమే కానీ మీడియా విషయంలో ఇలాంటివి వద్దు.. అంటూ సదరు విలేఖరి ఫైర్ అయ్యాడు. అప్పుడు వేదికపై వెంటనే క్షమాపణలు చెప్పిన సుమ.. తాజాగా మరోసారి క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం సుమ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.