గుంటూరు కారం మూవీలో మహేష్ వేసుకున్న చెప్పుల కాస్ట్ తెలిస్తే అవాక్ అవ్వాల్సిందే..!!

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరు గతంలో అతడు, ఖ‌లేజా రెండు సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అతడు మహేష్ బాబు కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇక ఖ‌లేజా మూవీ ఇప్ప‌టికి చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఫేవరెట్ మూవీగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబును మాస్ మసాలా అవతార్‌లో చూపిస్తున్నాడు. ఇందులో గ్లామరస్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తుంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన స్టిల్స్, పోస్టర్స్‌కి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ పోస్టర్‌లో మహేష్ బాబు ఓ వాహనం వెనుక భాగంలో కూర్చుని సిగరెట్ తాగుతూ పెద్ద ఫైటింగ్‌కి రెడీగా ఉన్నట్లు కనిపిస్తాడు. చాక్లెట్ రంగు ప్యాంటు, నల్ల చొక్కా, చెప్పులు ధరించాడు. మహేష్ బాబు ధరించిన ఈ చెప్పులు అటు ఫాన్స్ తో పాటు ఇటు మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చెప్పుల కాస్ట్ ఎంత అనేది ఫ్యాన్స్‌ కనిపెట్టారు. వారి సెర్చ్ ప్రకారం మహేష్ బాబు వేసుకున్న చెప్పులు ఎకోఅప్‌రోడ్ అనే కంపెనీ తయారు చేసిన చెప్పులట. ఇవి చాలా ఖరీదైనవి. ఇటి కాస్ట్ రూ.7999ని తెలుస్తుంది. సామాన్యులు ధరించే వాటితో పోలిస్తే ఇది చాలా ఎక్కువనే చెప్పాలి.

దీంతో మహేష్ బాబు తన వ్యక్తిగత జీవితంలోను, సినిమాల్లోనూ ఇలాంటి కాస్ట్లీ వస్తువులనే వేసుకుంటాడా అంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక గతంలో కూడా మహేష్ బాబు వేసుకున్న షర్ట్ , ప్యాంట్ల కాస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు వేసుకుంటున్న ప్రతి ఒక్క కాస్ట్యూమ్ ఖరీదు చూసి ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటున్నారు. అయితే ఆ చెప్పులు అతనివేనా లేక మూవీ టీం అందించారా అనే విషయం క్లారిటీలేదు. ఇక ఈ మూవీ షూటింగ్ టైంలో మహేష్ కాస్ట్యూమ్స్ చాలా రకాలు వాడుతున్నాడట.