స్పై సినిమా రిలీజు పై హాట్ కామెంట్స్ చేసిన నిఖిల్..!!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత మళ్లీ అంతటి పాపులారిటీ సంపాదించుకున్న చిత్రం స్పై.. ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకబడిన రహస్యాల గురించి తెలియజేస్తారని ఆడియన్స్ ముందుకు తీసుకురావడం జరిగింది.. అయితే ఈ సినిమాలో అసలు పాయింటు లేకపోవడంతో ప్రేక్షకులకు విసుగు వచ్చేలా చేసిందని సమాచారం. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఫ్లాప్ పై నిఖిల్ మాట్లాడడం జరిగింది.


నిఖిల్ మాట్లాడుతూ స్పై సినిమా విషయంలో చాలా తప్పులు జరిగాయి.. షూటింగ్ కూడా మొత్తం పూర్తి అవ్వలేదు ఇంకా పది రోజులు షూటింగ్ చేయవలసి ఉండగా అది చేయకుండానే సినిమా విడుదల చేశారు.. ఈ విషయం తెలిసి తనకు కోపం వచ్చిందని నా ఫ్యూచర్ సినిమాలలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని తెలియజేశారు హీరో నిఖిల్.. ప్రస్తుతం నిఖిల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా నిఖిల్ కి సమాచారం ఇవ్వకుండానే సాంగుని నిర్మాతలు రిలీజ్ చేశారని..అప్పుడు కూడా చాలా గొడవలు జరిగినట్టుగా వార్తలు వినిపించాయి. కానీ నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆ నీటిని లైన్ లో పెట్టారు డైరెక్టర్ భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో స్వయంభు అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు.అలాగే రామ్ చరణ్ నిర్మాతగా ది ఇండియా హౌస్ అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే కార్తికేయ-3 సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.