మొబైల్ ఫోన్స్ పేలడానికి కారణం ఈ తప్పే..!!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ కచ్చితంగా ఉండనే ఉంటుంది.. మనం ఎక్కడికి వెళ్లినా మన వ్యక్తిగత డేటాని తెలియజేయాలన్న కచ్చితంగా మన స్మార్ట్ మొబైల్స్ లో పలు రకాల ఫోటోలతో పాటు పేపర్లను కూడా సేవ్ చేసుకొని ఉంటున్నాము.అందుకే మొబైల్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైనదిగా ఉపయోగకరమైనదిగా మారిపోయింది. అయితే ఇలాంటి మొబైల్స్ తో మనం చేసే చిన్న తప్పుల వల్ల ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.

What causes smartphones to burst? Keep check of these warning signs -  Hindustan Times

తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మొబైల్ పేరుతున్న సంఘటన మనం వింటూనే ఉన్నాము.. అందులో బ్యాటరీ పేలడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయట.. మనం చేసే చిన్న పొరపాటు వల్ల ఈ మొబైల్ పేలుడు సంభవించవచ్చని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. మొబైల్ ఛార్జింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ చుట్టూ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా కూడా బ్యాటరీ హీటెక్కుతోందట .ఇలాంటి పరిస్థితులలో అది పేలి అవకాశం ఉంటుందట.మొబైల్లో రసాయనాలు మారుతూ ఉండడం వల్ల బ్యాటరీ సెల్ పనిచేయకపోవడం వల్ల బ్యాటరీ ఉబ్బి పేలుతుంది..

మొబైల్ బ్యాటరీని ఈ విధంగా చెక్ చేసుకోవాలి:
మొబైల్ ఫోన్ స్క్రీన్ అస్పష్టంగా ఉందా లేకపోతే స్క్రీన్ లో పూర్తిగా చీకటిగా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పదే పదే హ్యాంగ్ అవుతున్నప్పటికీ ప్రాసెసింగ్ నెమ్మదిగా ఉంటే మొబైల్ ఎప్పుడైనా పెలవచ్చు.

మొబైల్ బ్యాటరీని తీసివేయడానికి అవకాశం ఉంటే బ్యాటరీని టేబుల్ పైన ఉంచండి.. ఆ తర్వాత బ్యాటరీ ని తిప్పుతున్న సమయంలో ఏదైనా ఉబ్బుగా అనిపిస్తే బ్యాటరీ త్వరలోనే పేలే అవకాశం ఉంటుందట.

తరచూ స్మార్ట్ మొబైల్ వేడెక్కుతున్నట్లయితే బ్యాటరీ పాడైపోయినట్లు గుర్తించాలి.

బ్యాటరీ చార్జింగ్ పర్సంటేజ్ 20% కన్నా ఎక్కువగా ఉన్నప్పుడే చార్జింగ్ పెట్టడం మంచిది. లేకపోతే అధిక ఛార్జింగ్ విద్యుత్ సరఫరా వల్ల బ్యాటరీ పీలే అవకాశం ఉంటుంది.

చేయకూడని పనులు:

చార్జింగ్ చేస్తున్న సమయంలో చార్జర్ పిన్ ఎప్పుడు తడిగా ఉండకూడదు..

తరచూ మొబైల్ ని 100% చార్జింగ్ చేయకూడదు.

కంపెనీ వారు ఇచ్చిన చార్జర్ ని మొబైల్ కి ఉపయోగించాలి.

తక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న మొబైల్ కు ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన చార్జర్ తో పెట్టకూడదు.