బాలయ్య కోసం మహేష్ బాబు నందమూరి ఫ్యాన్స్ కు పండగే..?!

నందమూరి నట‌సింహం బాలయ్య.. ఎన్టీఆర్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల కాలంగా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోగా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక గతంలో బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి రెండు సినిమాలు రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు అదే ఉత్సాహంతో త్వరలోనే మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు బాలయ్య.

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మూవీ ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఇకపోతే ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, రెండు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ గురువారం వెలువ‌డింది. అక్టోబర్ 8న ఈ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారంటూ వెల్లడించారు మూవీ మేకర్స్.

ఇక భగవంత్‌ కేసరి మూవీకి సంబంధించిన ట్రైలర్ ఎలా రిలీజ్ చేయబోతున్నారని అంశంపై క్లారిటీ లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నో ఊహగానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా బాలయ్య భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ కాబోతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.