దసరా కానుకగా మహేష్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే న్యూస్ ఇది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మీ దసరా పండక్కి ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతుంది.

ఈ సినిమాలోని మొదటి పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేకర్ రివిల్ చేశారని.. ఈ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. పోస్టర్లో మహేష్ ఫుల్ మాస్ లుక్ లో దర్శనం ఇస్తాడట. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని డిసెంబర్ మొదటి వారంలో కానీ.. రెండో వారంలో కానీ పూర్తి చేసుకుంటారు.

షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11, 2024న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీ తో త్రివిక్రమ్ ఈ సినిమా కాథ‌ని ప్లాన్ చేశాడట. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.