కొన్ని వంటకాలు వండిన రోజు కంటే మరుసటి రోజు బాగుంటాయి… అవేంటో తెలుసా…!!

చాలామంది బిర్యానీని మరుసటి రోజు తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దాని రుచి నిల్వ ఉంచిన కొద్ది పెరుగుతుంది. ఈ బిర్యానీతో పాటు కొన్ని కూరలు కూడా మరుసటి రోజు టేస్టీగా మారుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్రీస్:
చాలా కర్రీస్ లో టమోటో, ఆనియన్ గ్రేవీ, కొన్ని మసాలాలు కలుపుతారు. దీనివల్ల ఈ పదార్థాలు అన్ని కలిసి మరుసటి రోజు మరింత రుచిగా మారతాయి. చికెన్, మటన్, పనీర్ వంటి వాటి రుచ్చి మరింత పెరుగుతుంది.

బిర్యానీ:
బాస్మతి బియ్యం, మాంసం, మసాలాలు కలిపి తయారు చేసే బిర్యానీ రుచి కూడా చేసిన రోజు కంటే మరుసటి రోజు బాగుంటుంది. కొన్ని రకాల మసాలాల వల్ల ఇలా జరుగుతుంది.

శనగలుకూర:
కాబూలీ శనగలు లేదా సాధారణ శనగలు వేసి వండిన కూర మరుసటి రోజు మరింత రుచి ఉంటుంది. చేసిన రోజు కంటే తరువాతే రోజు ఈ శనగలు మరింత మృదువుగా మారడం వల్ల ఇలా జరుగుతుంది.

రాజ్మా:
నార్త్ ఇండియాలో రాజ్మా కర్రీ చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నం లేదా చపాతీలోకి ఇది బాగుంటుంది. అయితే దీనిలో ఉపయోగించిన మసాలాలు రాజ్మాకు పట్టి మరుసటి రోజు రుచి మరింత పెరుగుతుంది.

క్యారెట్ హల్వా:
ఇండియన్ డిజర్ట్స్ లో చాలామంది ఇష్టపడేది క్యారెట్ హల్వా. డ్రై ఫ్రూట్స్ కలిపి దీనిని తయారు చేస్తారు. అయితే చేసిన రోజు కంటే తరువాత రోజు ఈ స్వీట్ మరింత రుచికరంగా ఉంటుంది.

సాంబార్:
కందిపప్పుతో తయారు చేసే సాంబార్ అంటే చాలామందికి ఇష్టం. ఎంతో ఆరోగ్యం కూడా. అయితే ఈ సాంబార్ తయారుచేసిన రోజు కంటే మరుసటి రోజు మరింత టేస్టీగా ఉంటాయి. పులుపు అంతా కలిసిపోయి మంచి రుచి వస్తుంది.

దాల్ మఖానీ:
పంజాబ్ రెస్టారెంట్లో ఎక్కువగా కనిపించే కర్రీ దాల్ మఖానీ. చపాతీ, పూరి, పుల్కా లోకి ఇది బాగుంటుంది. పప్పు దినుసులతో పాటు మసాలాలు, ఆనియన్, టమోటో గ్రేవీతో దీనిని తయారు చేస్తారు. అందువల్ల ఇది తయారుచేసిన రోజు కంటే మరుసటి రోజు బాగుంటుంది.

మొలకెత్తిన విత్తనాలు:
బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ గా మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇవి కూడా మరుసటి రోజు తింటే రుచి బాగా పెరుగుతాయి.