దళపతి విజయ్ ఫిట్‍నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా.. రోజూ అది ఉండాల్సిందే అట‌!

కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌మిళంలో పాటు తెలుగులోనూ విజ‌య్ కు భారీ క్రేజ్ ఉంది. ఆయ‌న న‌టించే ప్ర‌తి సినిమా త‌మిళంలో పాటు తెలుగులోనూ విడుద‌ల అవుతుంటుంది. త్వ‌ర‌లోనే విజ‌య్ `లియో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 19న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకున్న లియోలో త్రిష హీరోయిన్ గా న‌టించింది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌.. సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు. ప్రేక్షకులు లియోను ఖ‌చ్చితంగా ఎంజాయ్ చేస్తార‌ని ఆయ‌న తెలిపారు.

ఈ క్ర‌మంలోనే ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫిట్‌నెస్ సీక్రెట్ ను రివీల్ చేశారు. విజయ్ చాలా త‌క్కువ‌గా ఆహారం తీసుకుంటార‌ని.. ప్రతీ రోజు తప్పకుండా 30 నుంచి 40 నిమిషాల పాటు కార్డియో ఎక్సర్‌సైజ్‍లు చేస్తారని లోకేశ్ తెలిపారు. చాలా సంవత్సరాలుగా విజయ్ ఒకే రేంజ్‍లో శరీర బరువును మెయింటెన్ చేస్తున్నారని.. అదే ఆయన ఫిట్‍నెస్ సీక్రెట్ అని లోకేష్ తెలిపారు. దీంతో ఆయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.