టాక్ బాగున్నా `స్కంద‌`కు 3 రోజుల్లో వ‌చ్చింది ఇంతేనా.. ఇలాగైతే చాలా క‌ష్టం!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా `స్కంద‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

అయిటే టాక్ బాగున్నా స్కంద క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఏమాత్రం జోరుని చూపించ‌లేక‌పోతోంది. వీకెండ్ అడ్వాంటేజ్ కూడా ఈ మూవీకి పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. అద్భుత‌మైన ఓపెనింగ్స్ తో తొలిరోజును ప్రారంభించినా.. 2వ రోజు నుంచి స్కంద క‌లెక్ష‌న్స్ డ్రాప్ అవుతూ వ‌చ్చాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.62 కోట్లు, రెండో రోజు రూ. 3.50 కోట్ల షేర్ ను ద‌క్కించుకున్న స్కంద‌.. 3వ రోజు రూ. 3.27 కోట్ల షేర్ ను వ‌సూల్ చేసింది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 3.81 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

ఇక రూ. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. మొత్తం మూడు రోజుల్లో తెలుగు రాష్టాల వ్యాప్తంగా రూ. 15.39 కోట్ల షేర్‌, రూ. 24.95 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 18.38 కోట్ల షేర్‌, రూ. 31.05 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను స్కంద సొంతం చేసుకుంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 28.62 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాల్సి ఉంది. మ‌రి ఇప్పుడున్న జోరుతో అంత భారీ టార్గెట్ ను అందుకోవ‌డం అంటే చాలా క‌ష్ట‌మ‌నే చెప్పాలి. కాగా, ఏరియాల వారీగా స్కంద 3 డేస్ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం: 6.32 కోట్లు
సీడెడ్: 2.25 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.97 కోట్లు
తూర్పు: 1.09 కోట్లు
పశ్చిమ: 73 లక్ష‌లు
గుంటూరు: 1.56 కోట్లు
కృష్ణ: 75 లక్ష‌లు
నెల్లూరు: 72 లక్ష‌లు
————————–
ఏపీ+తెలంగాణ‌=15.39 కోట్లు(24.95 కోట్లు~ గ్రాస్)
————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.55 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 1.44 కోట్లు
————————–
టోటల్ వరల్డ్ వైడ్= 18.38 కోట్లు(31.05 కోట్లు~ గ్రాస్)
————————–