అలా చేస్తే లోకజ్ఞానం పెరుగుతుందంటూ ఫ్యాన్స్‌కి రష్మిక ఫ్రి సజెషన్..?!

ఛ‌ల్లో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రష్మిక మంద‌న‌. మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటూ మంచి క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్పా సినిమాతో శ్రీవల్లిగా కనిపించి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పలు భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీబిజీగా గడుపుతుంది.

సినిమాల్లో బిజీగా ఉన్న ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను, సినిమా విషయాలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఇటీవల కాలంలో తాను షూటింగ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ట్రావెలింగ్ ని చాలా మిస్ అవుతుందట. ఆమెకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టమని.. అయితే ట్రావెలింగ్ చేసే వారికి ఒక చిన్న విషయం.. ఎప్పుడైనా మీకు కొంత సమయం దొరికితే మీ ట్రావెలింగ్ డెస్టినేషన్ నిర్ణయించుకోండి అంటూ వివ‌రించింది.

ఆమె మాట్లాడుతూ ఆ టూర్‌ ఎక్కడికైనా సరే మీ సొంత ఊరు అయినా.. లేదా మీ స్నేహితుల ఇంటికైనా.. లేదా మీ డ్రీం ప్లేస్ అయిన ఒంటరిగా లేదా కుటుంబంతో ఎక్కడికైనా ఏదైనా ప్రయాణం చేయండి. దానివల్ల కొంత లోకజ్ఞానం తెలుస్తుంది. అలాగే పలు ప్రాంతాల్లో విభిన్న ఆహారాలు, సంస్కృతులు, మతాలు, జీవన విధానాలు ఏంటో కూడా మనకి తెలుస్తాయి అంటూ రష్మిక తన ట్విట‌ర్‌ వేదికగా పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.