వామ్మో ..వెంకటేష్ చిన్నల్లుడు బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి ..అన్ని కోట్లకు వారసుడా..!

టాలీవుడ్ లో ఫ్యామిలీ స్టార్ గా తిరుగులేని స్థాయిలో నిలిచిన హీరో విక్టరీ వెంకటేష్. ఈయన సినిమాలు థియేటర్స్ లో విడుదల అయితే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. పండగకి బంధువులు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో, అలా వెంకటేష్ సినిమా థియేటర్స్ లో కుటుంబ ప్రేక్షకులతో కళకళలాడుతుంటుంది. వెంకటేష్ కేవలం వెండితెర మీదనే కాదు.. నిజజీవితంలో కూడా ఎంతో పద్ధతిగా ఉంటాడు.

అలాగే తమ పిల్లలను కూడా అంతే పద్ధతితో పెంచాడు. మొదటి కూతురికి ఎంతో ఘనంగా పెళ్లి జరిపించి పంపించాడు. ఇప్పుడు రెండవ కూతురు హవ్య వాహిని కి కూడా ఘనంగా పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడు. మొన్ననే విజయవాడలో హవ్య వాహిని నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ కి చెందిన టాప్ మోస్ట్ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే హవ్య వాహిని వివాహం చేసుకోబోయే వ్యక్తి పేరు ఆకాష్. ఇతను దేశంలోనే టాప్ 10 గైనకాలజిస్ట్ డాక్టర్స్ లో ఒకడు. ఈయన నెలవారి సంపాదన కోట్లలో ఉంటుందట. ఇది విన్న ప్రేక్షకులు ఇలాంటి తండ్రి అందరికీ ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి ఎప్పుడు ఏమిటి అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం వీరిది ప్రేమ వివాహంగా తెలుస్తుంది. కామన్ ఫ్రెండ్ ద్వారా హవ్య వాహిని, ఆకాష్ మీట్ అయినట్లు తెలుస్తుంది.

ఆ పరిచయం స్నేహంగా మారి.. ఆ తర్వాత ప్రేమగా మారినట్లు తెలుస్తుంది. ఇరు కుటుంబాలు ఇద్దరు సంతోషంగా ఉండాలని.. ఈ ప్రేమ పెళ్లికి అంగీకరించినట్లు సమాచారం. మొత్తానికి వెంకటేష్ మంచి సౌండ్ పార్టీనే పట్టాడు అంటూ.. ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? అనే విషయాలపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. చూద్దాం దగ్గుబాటి ఫ్యామిలీ దీనిపై ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తుందో.