తల్లి కోసం అలాంటి పని చేసిన ఉపాసన..కట్ చేస్తే..!

ఉపాసన కామినేని అలియాస్ కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఒకవైపు పని చేస్తూనే మరొకవైపు మెగా కోడలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సమాజ సేవ చేస్తున్న ఈమె ఎంతో మందికి అండగా నిలుస్తోంది. అంతేకాదు సహాయం అని వచ్చిన వారికి కాదనకుండా తన వంతు సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్న ఉపాసన.. తన తల్లి కోసం కూడా ఒక పని చేసింది.

ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ , ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే 11 సంవత్సరాలుగా ఎంతో సంతోషంగా ఉంటూ మరింత మందికి ఆదర్శంగా నిలిచిన ఈ జంట.. ఈ ఏడాది ఒక చిన్నారికి జన్మనిచ్చారు. ప్రస్తుతం కూతురు ఆలనా పాలన చూసుకుంటూ సంతోషంగా ఉన్న ఉపాసనకు సంబంధించి ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. అసలు విషయంలోకి వెళ్తే ఉపాసన తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలే అన్న విషయం తెలిసిందే .వీరికి మగ సంతానం లేని కారణంగా ఉపాసన తండ్రి తన కూతుర్లు ఇద్దరినీ కూడా మగపిల్లల్లాగా పెంచారు.

 

ఇదే ధైర్యంతో ఉపాసన అలాగే తన సోదరి అనుష్పాల ఇద్దరు కూడా పెద్ద ఎత్తున బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించారు. అయితే తన తల్లిదండ్రులకు పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్ళనని చాలా గట్టిగా చెప్పిందట ఉపాసన. కానీ తన తల్లి శోభా మాత్రం ఉపాసనను కూర్చోబెట్టుకొని పెళ్లి, జీవితం గురించి అన్ని వివరించిందని దీంతో చరణ్ ప్రేమ కోసం తన పంతాన్ని కూడా పక్కనపెట్టి తల్లి కోరిక మేరకు అత్తారింటికి వెళ్లిందని సమాచారం. ఏదిఏమైనా ఉపాసన అటు వైద్యరంగంలో ఇటు కోడలిగా కూడా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ మరింత గుర్తింపు సంపాదించుకుంది.