ఓజి విషయంలో త్రివిక్రమ్ పై ఫైర్ అయిన పవన్.. కారణం అదేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఎటువంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాలను బిజీగా ఉంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మరి పవన్ నటిస్తున్న భారీ సినిమాల్లో ఓజి సినిమా ఒకటి. ఈ సినిమాపై మొద‌టి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి 50% షూటింగ్ సర్వేగంగా జరిపిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో స్లోగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ గా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు.

ఇప్పటికే టీజర్ రిలీజై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్న ఈ సినిమాకి డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి నిర్మిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థ‌మన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో పవన్ త్రివిక్రమ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చాడట. ఈ మధ్యకాలంలో పవన్ చేస్తున్న ప్రతి సినిమాకు త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. బ్రో సినిమాలో కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వడంతో చాలా సీన్స్ తీసేసారు. దీంతో మూవీ ఫ్లాప్‌ అయిందని పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై ఫైరయ్యారు.

అనవసరమైన వాటిలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ కామెంట్స్ చేశారు. అయితే ఓజీ సినిమా విషయంలో కూడా మళ్లీ త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ జరిగిందట. డైరెక్టర్ సుజిత్ కు ఇష్టం లేకపోయినా ఒకటి రెండు సీన్లలో మార్పులు కూడా చేయాలంటే డిమాండ్ చేశాడట. ఇలా ప్రతి విషయంలో త్రివిక్రమ్ జోక్యం వల్ల సుజిత్ పై ప్రెషర్ ఎక్కువగా ఉందని ఇదే విషయాన్ని పవన్ తెలుసుకొని త్రివిక్రమ్ మీద ఫైర్ అయినట్లు సమాచారం. ఆల్రెడీ షూట్ చేసింది తీయడం కరెక్ట్ కాదు.. ఏదైనా ఉంటే ముందే స్క్రిప్ట్ దశ‌లో ఉండగా చెప్పాల్సింది.. ఇప్పుడు ఇలా చెప్తే ఎలా..? అంటూ పవన్ త్రివిక్రమ్ పై అరిచాడని టాక్‌ సినీ వ‌ర్గ‌ల నుంచి గ‌ట్టిగా వినిపిస్తుంది.