నిజమైన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని ఇలా కనుక్కోండి..?

ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరంగా ఉత్పత్తులను మించి నకిలీ ఉత్పత్తులు చాలానే పెరిగిపోతున్నాయి. దీనివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే నకిలీ ఉత్పత్తుల తయారీలలో ఎక్కువగా ప్లాస్టిక్ రైస్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇది నిజమైన బియ్యంలో కనిపిస్తూ ఉన్నాయి. మన చుట్టూ ఉన్న మార్కెట్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలు కూడా రాబోతున్నట్లు పలువురు నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్లాస్టిక్ బియ్యం పూర్తిగా ప్లాస్టిక్ తోనే తయారు చేయబడుతుందట.

ఈ బియ్యం మానవునికి చాలా హానికరంగా ఉంటాయి ఇది ప్లాస్టిక్ గింజలతో తక్కువ మొత్తంలో నిజమైన బియ్యాన్ని కలపడం వల్ల మనం వీటిని అసలు కనుక్కోలేము.. అయితే కొన్ని విధాల పరీక్షల వల్ల ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని మనం కనిపెట్టవచ్చట. వాటి గురించి తెలుసుకుందాం.

నీటి పరీక్ష వల్ల బియ్యం నిజమైనదా లేదా అనే విషయాన్ని నిర్ధారించడం చాలా సులభమైన పని అట.. ముఖ్యంగా బియ్యాన్ని కాస్త తీసుకొని నీళ్లలో వేసి బాగా కదిలించాలి బియ్యం నీటిలో మునిగితే అది నిజమైన బియ్యం.. ఎందుకంటే నీటిని పీల్చుకొని భారీగా మారుతుంది కాబట్టి..

ఒకవేళ బియ్యం నీటి ఉపారితలంపైన తేలితే అది కచ్చితంగా ప్లాస్టిక్ బియ్యం కావచ్చు అంటూ పలువురు నిపుణులు తెలుపుతున్నారు. ప్లాస్టిక్ బియ్యం మందం తక్కువగా ఉండి కేవలం తేలుతుంది.

2). మరొక పరీక్ష ఏమిటంటే ఒక పాత్రలో బియ్యాన్ని వేసి అందులో బియ్యాన్ని ఉడికించినట్లు ఉడికించినట్లు అయితే నిజమైన అన్నం మెత్తగా ఉడుకుతుంది. సువాసన వస్తుంది. ప్లాస్టిక్ బియ్యం అయితే ఉడికిన తర్వాత గట్టిగా ఉంటుంది. అది అసాధారణ వాసన కలుగుతుందట.

చివరిగా ప్లాస్టిక్ బియ్యాన్ని తీసుకొని లైటర్ ద్వారా గింజను వెలిగించడం వల్ల ప్లాస్టిక్ అయితే కరిగిపోతుంది నిజమైన బియ్యం అయితే బూడిదగా మారుతుందట.