అలాంటివాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. నిత్యామీనన్..?!

మలయాళ కుట్టి నిత్యమీనన్ఖ‌ఙ‌ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 8 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా హనుమాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. స్టార్కో వ‌ర‌ల్డ్‌ కేరళ అనే టూరిజం మ్యాగ్జైన్లో నిత్యమీనన్ ఫొటోస్ చూసిన మోహన్‌లాల్ ఆమెకు ఆకాశ గోపురం అనే సినిమా ద్వారా అవకాశాన్ని ఇచ్చి మలయాళ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆ తర్వాత జోష్‌తో కన్నడంలో అలా మొదలైందితో తెలుగులో మిషన్ మంగల్తో బాలీవుడ్‌లో ఇలా దాదాపు అన్ని భాషల్లోనూ న‌టించి నాచ్యుర‌ల్ బ్యూటిగా పేరు సంపాదించుకుంది.

ఎన్నో అవార్డులు అందుకుంది. పలు సినిమాల్లో పాటలు కూడా పాడి తన సింగింగ్ టాలెంట్‌ కూడా బయటపెట్టింది. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోనే కాదు సిరీస్ లు, టీవీ షోలోను తన ప్రత్యేకతను చాటుకుంటుంది. మోడల్ హైదరాబాద్ వెబ్ సిరీస్‌తో అంతర్జాతీయ లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఇండియన్ ఐడియల్ షో కి హోస్ట్‌గా వ్యవహరించింది. ఇక తాజాగా తన పెళ్లి పై స్పందించింది నిత్యమీనన్.

ఆమె మాట్లాడుతూ నేను పక్క ట్రెడిషనల్.. మన సాంప్రదాయ సంస్కృతులను ఎంతగానో గౌరవిస్తా. కానీ పెళ్లి విషయంలో మాత్రం నాకు ఒక పర్టిక్యులర్ ఒపీనియన్ అంటూ లేదు. పెళ్లి సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో కూడిన ఒప్పందం లాంటిది. నాకు అలాంటి సెక్యూరిటీ లేమి అవసరం లేదు. ఎవరైనా దానికి మించి ఆలోచన చేయగల వ్యక్తి నాకు దొరికినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా.. అంటూ వివరించింది. ప్రస్తుతం నిత్యమీనన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.