మూవీ పాతదైన.. ట్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగ్స్ ఏంటో తెలుసా..?

కొన్ని కొన్ని సినిమాలు రిలీజై ఏళ్ళు దాటొచ్చు కానీ.. ఈ సినిమాలో హీరోలు చెప్పే పంచ్ డైలాగులు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హీరోకు ఓ మేనరిజంతో కూడిన పంచ్ డైలాగ్ ఉంటుంది. అలా ఇండస్ట్రీలో కొందరు హీరోలు ట్రెండ్ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ప్రతి సినిమాలో ట్రెండింగ్ డైలాగులు ఉంటాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బద్రి:


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూవీ వచ్చి దాదాపు 23 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అందులో ” ఏయ్.. నువ్వు నందా అయితే… నేనే బద్రి… బద్రీనాథ్.. అయితే ఏంటి ” అనే డైలాగ్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది.

తొలిప్రేమ:


కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో క్లాసికల్ హిట్ కొట్టింది. అందులో నుంచి ” నిజమైన ప్రేమకి అర్థమేంటో తెలుసా.. మనం ప్రేమించినవాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే ” అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.

పంజా:


2011 లో వచ్చిన ఈ మూవీకి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి ” సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో.. సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు ” అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్ అవుతూనే ఉంది.

తీన్మార్‌:


జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమా హిట్ కానప్పటికీ ఈ మూవీలో ” కారణం లేని కోపం.. గౌరవం లేని ఇష్టం.. బాధ్యత లేని యవ్వనం జ్ఞానకం లేని వృద్ధాప్యం అనవసరం ” అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క సినిమాకి ఒక మేనరిజం ఉంటుంది.